రాజీ మార్గమే రాజ మార్గం: ఎస్పీ
SRPT: ఈ నెల 15వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని SP నరసింహ పిలుపునిచ్చారు. రాజీ ద్వారా కక్షిదారులు కేసుల పరిష్కారంతో సమయం, ధనం, శ్రమను ఆదా చేసుకోవాలన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, డ్రంకన్ డ్రైవ్, చెక్ బౌన్స్ వంటి వివాదాలు రాజీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజ మార్గం అని పేర్కొన్నారు.