VIDEO: 10 డిగ్రీలు.. దట్టంగా కురుస్తోన్న పొగమంచు
అల్లూరి జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో శుక్రవారం 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. దీంతో చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. ఓవైపు చలి, మరోవైపు దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఉదయం సుమారు 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది.