కురుమూర్తికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు
MBNR: కురుమూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చొరవతో టీజీఆర్టీసీ షాద్ నగర్ డిపో నూతన బస్సు సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు ఆత్మకూరు చేరుతుందని ఆర్ఎం తెలిపారు. తిరుగు ప్రయాణంలో బస్సు ఉదయం 5 గంటలకు బయలుదేరి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.