డ్వాక్రా యానిమేటర్లకు మొబైల్స్ పంపిణీ
PLD: సత్తెనపల్లి రఘురామ్ నగర్ ప్రజావేదికలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా 134 మంది డ్వాక్రా యానిమేటర్లకు రూ.21.44 లక్షల విలువైన మొబైల్స్ పంపిణీ చేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కన్నా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.