నోయిడా అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభం
UP నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్రం సుమారు రూ.11,200 కోట్ల వ్యయంతో జేవర్ ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, యూపీ సీఎం ఆదిత్యనాథ్, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. రోడ్డు, రైలు, మెట్రో అనుసంధాన కేంద్రంగా నోయిడా ఆధునిక ఎయిర్ పోర్టును తీర్చిదిద్దనున్నారు.