రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రకాశం: యర్రగొండపాలెం మండలం మొగుళ్ళపల్లి గ్రామ సమీపంలో ఇవాళ ద్విచక్ర వాహనం అదుపుతప్పి వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుండెపోటు వచ్చినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.