సత్తెనపల్లి సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
PLD: సత్తెనపల్లి సబ్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజుపాలెం మండలం అనుపాలెంకి చెందిన గోపికృష్ణ పలు దొంగతనాల కేసుల్లో సతైనపల్లి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఉండగా మనస్థాపంతో పదునైన టైల్స్ రాయితో ఖైదీ గోపికృష్ణ చేయి కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి అనంతరం సబ్ జైలుకు మంగళవారం తరలించారు.