ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన జెండా

NLR: పొదలకూరు పట్టణంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివ కృష్ణయ్య, జాతీయ జెండా ఎగురవేయగా, పోలీస్ స్టేషన్లో సీఐ శివరామకృష్ణ రెడ్డి, ఎస్సై హనీఫ్ జెండా వందనం చేశారు.