శానిటేషన్ సెక్రటరీని నియమించాలని వినతి

KDP: ప్రొద్దుటూరు మున్సిపాల్టీ 27వ సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీని నియమించాలని కౌన్సిలర్ షేక్ మహేనూర్ మున్సిపల్ కమిషనర్‌ని కోరారు. శుక్రవారం వార్డు ప్రజలను వెంట బెట్టుకొని వెళ్లి కమిషనర్ రవిచంద్ర రెడ్డికి వినతిపత్రం అందించారు. రెగ్యులర్ అధికారి లేక తమ వార్డులో శానిటేషన్ పనులు సక్రమంగా జరగట్లేదని తెలిపారు.