ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
NRML: కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.