బొబ్బిలి మార్కెట్లో ట్రాఫిక్‌తో ఇక్కట్లు

VZM: బొబ్బిలి మార్కెట్లో ట్రాఫిక్ సమస్య ప్రజలకు పెను సవాల్‌గా మారింది. శుక్రవారం ఉదయం మార్కెట్లో ట్రాఫిక్ జామ్ కావడంతో మార్కెట్‌కు వచ్చిన ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రతి రోజూ ఇదే సమస్య ఎదురవుతుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.