తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన DSP

కృష్ణా: 'ప్రజల వద్దకే పోలీస్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌ను గుడివాడ డీఎస్పీ ధీరజ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు న్యాయం అందేలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు పోలీస్ సేవలను ఆత్మవిశ్వాసంతో వినియోగించుకోవాలని సూచించారు.