ముధోల్‌లో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం
NRML: ముధోల్ మండలంలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో ఎంపికైన నాయకులను మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి హాజరై, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రశంసించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.