హైస్కూల్‌లో నూతన భవనాలు ప్రారంభం
విశాఖలోని కణితి జడ్పీ హైస్కూల్లో రూ.88 లక్షలతో నిర్మించిన నూతన భవనాలను ప్రభుత్వ విప్ డా.చిరంజీవిరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ నిర్మాణానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించిన 'అమ్మ ఫౌండేషన్' సేవలను వారు అభినందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాతలు పాఠశాల మౌలిక వసతుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.