పుంగనూరులో అల్లూరికి నివాళి

CTR: పుంగనూరులో రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి నిర్వహించారు. ఆ సంఘ సభ్యులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరవ అధ్యక్షుడు భక్తవత్సల రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా, మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోతారని కొనియాడారు.