చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

MNCL: జైపూర్ మండలం STPP ఎదుట ఫిబ్రవరి 28న కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు SI రామలక్ష్మి తెలిపారు. మతిస్థిమితం లేని సదరు వ్యక్తికి మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించగా, తుదిశ్వాస విడిచాడు. సోమవారం పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసినట్లు SI వివరించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారుపై దర్యాప్తు కొనసాగుతోంది.