రామచంద్రపురంలో అభివృద్ధి పరుగులు: మంత్రి
కోనసీమ: రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ.. గడిచిన 22 నెలల్లో పట్టణంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. గురువారం ఒక్కరోజే రూ. 68 లక్షలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వివరించారు.