ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు

ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. పవిత్ర దినాన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాసౌరవము నిర్వహించారు. సూర్యదేవుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఆలయం భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.