మురికి గుంటలపై స్ప్రేయింగ్ చేయిస్తున్న వైద్యాధికారులు

కోనసీమ: మామిడికుదురు పాసర్లపూడి లంక గ్రామంలో దోమల నివారణ చర్యలను గురువారం చేపట్టారు. ఎబేట్ అనే లార్విసైడ్‌ను డ్రెయిన్లు, మురికి నీటి గుంటలపైన స్ప్రేయింగ్ చేశారు. గుడ్డు దశలో దోమ లార్వాలను ఈ మందు సమర్థవంతంగా నాశనం చేస్తుందని హెల్త్ అసిస్టెంట్ ఏడిద కవీంద్ర తెలిపారు. కాచి చల్లార్చిన మంచి నీటినే తాగాలని తెలిపారు.