కొత్తపల్లిలో మురుగు కాలువ శుభ్రతకు వినతి.!

కొత్తపల్లిలో మురుగు కాలువ శుభ్రతకు వినతి.!

KDP: పులివెందుల మండల పరిధిలోని కొత్తపల్లిలో శుభ్రత లోపించి మురికి కాలువలో మురుగు నీరు నిలిచి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని బీజేపీ ఎస్సీ మోర్చా కడప జిల్లా అధ్యక్షులు శ్రీరాములు కోరారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రామాంజనేయరెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు.