'ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు యువత దూరంగా ఉండాలి'

'ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు యువత దూరంగా ఉండాలి'

అన్నమయ్య:  ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు యువత దూరంగా ఉండాలని మదనపల్లె టూ టౌన్ సీఐ కే. రాజారెడ్డి హెచ్చరించారు. ఇవాళ టూ టౌన్ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ స్పీడుగా మోటార్ సైకిల్ నడిపే వారిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.