ముగిసిన అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు మండలం నెక్కొంది గ్రామం కొండపై కొలువైన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం శయనోత్సవంతో ముగిశాయి. 11 రోజులపాటు అర్చకులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఉదయం లింగానికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, అష్టోత్తరాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.