పొన్నూరు అర్బన్‌లో పోలీసు కవాతు

గుంటూరు: పొన్నూరు అర్బన్‌లో ఆదివారం అర్బన్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. పాత పొన్నూరు, షరాఫ్ బజార్, కసుకరు రోడ్డు, అంబేద్కర్ కాలనీ,నేతాజీ నగర్ ప్రాంతాలలో పోలీసు కవాతు నిర్వహించి ప్రజలు ఎటువంటి భయ భ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఇందులో ఎస్సై రాజకుమార్, ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి