ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం

ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద గురువారం ఆ నలుగురు సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల వెంకటేష్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు మజ్జిగ, గుడ్లను పంపిణీ చేస్తున్నామన్నారు.