VIDEO: 'భూమి ఆక్రమణ.. న్యాయం చేయండి'
NLR: తమ సాగులో ఉన్న భూమిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆంజనేయ పురానికి చెందిన గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి నరసింహంకు వినతి పత్రం సమర్పించారు. 1142/5A లోని భూమిని గత 30 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.