ప్రజావాణికి అధికారుల డుమ్మా
NGKL: తాడూరు మండల MRO ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ మినహా పలువురు అధికారులు డుమ్మా కొట్టారు. దీంతో ఉదయం కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు తిరిగి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి సోమవారం జరిగేదేనని కొందరు వాపోయారు. దీనిపై తహసీల్దార్‌ని పలువురు వివరణ అడగగా .. హాజరు కానీ అధికారులకు నోటీసులు జారీ చేస్తామన్నారని తెలిపారు.