'పత్రాలు నిశితంగా పరిశీలించాలి'
VZM: భూములకు సంబంధించిన సరైన పత్రాలు నిశితంగా పరిశీలించిన తరువాతనే ఆన్లైన్‌లో పెట్టాలని మీసేవ ఆపరేటర్లకు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు కొత్తవలస ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత సూచించారు. ఈ మేరకు మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సమావేశం ఏర్పాటు చేశామన్నారు.