iBOMMA రవి కేసులో విస్తుపోయే నిజాలు..!
HYD: iBOMMA రవి కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. అతను సినిమాలు నేరుగా పైరసీ చేయకుండా టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిచ్ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. తక్కువ క్వాలిటీ సినిమాలను టెక్నాలజీతో HDలోకి మార్చి iBOMMA, బప్పం సైట్లలో పోస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ. 20 కోట్ల వరకు సంపాదించినట్లు వెల్లడించారు.