విత్తన బిల్లు-2025 ముసాయిదా విడుదల

విత్తన బిల్లు-2025 ముసాయిదా విడుదల

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ విత్తన బిల్లు-2025 ముసాయిదాను విడుదల చేసింది. అందులోని అంశాలపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. విత్తనచట్టం-1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు-1983ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లును తీసుకొస్తోంది. అత్యంత నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చి నకిలి, నాసిరకం విత్తనాల అమ్మకాలను అరికడుతుందని తెలిపింది.