15లోపు బిల్లులు చెల్లించుకుంటే నిరవధిక సమ్మె: కాంట్రాక్టర్లు
WGL: గ్రేటర్ WGL పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల బిల్లులను ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలని సివిల్ కాంట్రాక్టర్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌ని కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈనెల 15లోపు బిల్లులు చెల్లించుకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు. తమ పరిస్థితిని అర్ధం చేసుకుని తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరారు.