వేంకటేశ్వరస్వామికి పూజలు చేసిన ముస్లింలు

వేంకటేశ్వరస్వామికి పూజలు చేసిన ముస్లింలు

AP: వైఎస్సార్ కడప జిల్లాకేంద్రంలోని దేవునిగడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు పూజలు చేశారు. బీబీ నాంచారమ్మను వేంకటేశ్వరస్వామి వివాహం చేసుకున్నాడని, అందుకే స్వామివారిని తమ అల్లుడిగా భావించి పూజలు చేస్తామని ముస్లింలు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఉగాదికి సారె సమర్పించడం తమ ఆనవాయితీ అని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.