VIDEO: గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించాలి: మంత్రి
HYD: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును గ్రామగ్రామాన సంబరాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలన్నారు.