'అర్హులందరికీ పెన్షన్ అందిస్తాం'
E.G: అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీలో నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.