ఉయ్యూరులో వైసీపీ భారీ ర్యాలీ

కృష్ణా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, పెనమాలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఉయ్యురు పట్టణంలో వైసీపీ నాయకులు రైతులు కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ అంకితభావంతో పనిచేస్తుందని దేవభక్తుని చక్రవర్తి అన్నారు.