అడవి పంది దాడి.. రైతుకు తీవ్ర గాయాలు
పార్వతీపురం జిల్లా కురుపాం మండలం జి. శివడ గ్రామంలో ఓ రైతుపై అడవి పంది దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొండ వద్ద కొండపోడు వ్యవసాయం చేస్తుండగా, గిరిజన రైతు పాలక మాడుగుపై అడవి పంది దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మైరుగైన వైద్యం కోసం స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.