కనిగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన
ప్రకాశం: కనిగిరి డిపో ప్రాంగణంలో శుక్రవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులలో సౌకర్యాలు కల్పించాలని, సమస్యల పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.