'విజ్ఞానాన్ని పెంపొందించేది సైన్స్'
అన్నమయ్య: ప్రతి మానవుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేది సైన్స్ అని HM కే.భారతి అన్నారు. రాజంపేట మండలం కొత్త బోయినపల్లి SJSM ZPHS పాఠశాలలో మంగళవారం DEO ఆదేశాల మేరకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టును రూపొందించారని విద్యార్థులను చూస్తుంటే బాల శాస్త్రవేత్తలుగా ఉన్నారని ఆమె తెలిపారు.