VIDEO: 'నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి'

MNCL: జన్నారం మండలంలోని రాయికుంటలో పాడైన బోర్లకు అధికారులు మరమ్మతులు చేయించాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. మంగళవారం రాయికుంట గ్రామంలో సీపీఎం ప్రతినిధి బృందం పర్యటించింది. సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బోర్లు పాడుకావడంతో ప్రజలు నీటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఇందిరమ్మ ఇళ్ళకు నీరు పట్టడం కష్టంగా ఉందన్నారు.