వన్యప్రాణుల సంరక్షణే ప్రభుత్వ ఎజెండా: మంత్రి
HNK: అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే తమ ప్రజా ప్రభుత్వ ఎజెండా అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో ఆమె స్టేట్-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రాణుల మనుగడపైనే మన ఉనికి ఆధారపడి ఉందని ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.