గ్రామ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు

గ్రామ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు

కృష్ణా: గుడివాడ(మం) వలివర్తిపాడు క్రాస్ రోడ్స్ వద్ద గ్రామ ప్రజల సహకారంతో ఎస్సై చంటిబాబు మంగళవారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను పెంపొందించేందుకు, నేరాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.