ఆధార్ సేవలుసద్వినియోగం చేసుకోవాలి

SKLM: జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఐదు సచివాలయాలకు ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.