'స్థానిక సంస్థల తుది జాబితా విడుదల'

RR: స్థానిక సంస్థల తుది ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పుల తర్వాత తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో మొత్తం 7,52,259 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 3,76,823, మహిళలు 3,75,408, 28 మంది ఇతరులు ఉన్నారు. 4,668 వార్డులు, 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు.