శ్రీకాకుళం జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 6,51,645 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కొత్త రేషన్ కార్డు కార్డుదారుని ఫోటోతో సహా కుటుంబ సభ్యులు వివరాలతోపాటు QR కోడ్ కూడా ఉంటుంది.