రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జట్టుకు ఆర్థిక సహాయం
NDL: 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు నంద్యాల బాలురు, బాలికల జట్లు ఎంపికయ్యాయి. బాలికల జట్టుకు దుస్తులు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా ఉపాధ్యక్షురాలు చెన్నమరాజ వసుంధర దేవి తన వంతుగా 14 మంది బాలికలకు ఆర్థిక సహాయం చేశారు. క్యాంపులో బాలికల జట్టును కలిసి వారిని ఉత్సాహపరిచారు. కబడ్డీ క్రీడకు నిరంతరం సహకారం అందిస్తానని ఆమె తెలిపారు.