VIRAL: ధురంధర్-2.. థియేటర్‌లో రచ్చ
HYD పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ పీవీఆర్‌లో గందరగోళం నెలకొంది. 'ధురంధర్-2' సినిమాకి ఒకే స్క్రీన్‌లో తెలుగు, హిందీ వెర్షన్లకు టికెట్లు అమ్మడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. దీంతో గంటపాటు షో నిలిచిపోగా.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు వేరే స్క్రీన్‌లో తెలుగు షో వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.