రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన
VKB: దక్షిణ భారతదేశంలో ఏకశిలా పర్వతంగా పేరుగాంచిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం ఉదయం అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామూహిక లక్ష బిల్వార్చన నిర్వహించారు. కార్తీక మాసంలో పరమశివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం సామూహిక లక్ష బిల్వార్చన నిర్వహించామని ఈవో బాల నరసయ్య తెలిపారు.