'ఏసీబీకి పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలి'

'ఏసీబీకి పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలి'

SRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి తీవ్రంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రంగా అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ ఆఫీసులో లంచం అనేది పెనుభూతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు.