వైసీపీ భూ అక్రమాలపై సీఎంకు వినతి

అన్నమయ్య: వైసీపీ నాయకులు పాల్పడిన భూ ఆక్రమణలపై పుల్లంపేట టీడీపీ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం అమరావతిలోని పార్టీ కార్యాలయంలో కూడా ఛైర్మన్ టీడీపీ ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణమ నాయుడు, రామచంద్ర నాయుడు, ముద్ద సుభాశ్ రెడ్డి పాల్గొన్నారు.