మావోయిస్ట్ వారోత్సవాలు.. జిల్లాలో హై అలర్ట్
మావోయిస్ట్ వారోత్సవాలతో అల్లూరి జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాడేరు ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అలాగే, డ్రోన్లతో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలన్నారు.