10వ తరగతి విద్యార్థులకు జిల్లా ఎస్పీ సూచన

10వ తరగతి విద్యార్థులకు జిల్లా ఎస్పీ సూచన

E.G: 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. 16 నుంచి పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.